న్యూస్‌రీల్
జిల్లాలో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. జనంపై దాడులు చేస్తూ పిక్కలు పీకుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. మూడేళ్లలో 2,450 కుక్కకాటు కేసులు నమోదు కావడం జిల్లాలోని పరిస్థితికి అద్దం పడుతోంది. – కామారెడ్డి టౌన్
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
– 8లో u
ఈనెల 22వ తేదీన దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఐదేళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
ఈనెల 9వ తేదీన దోమకొండ మండల కేంద్రంలో పలువురిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
జనవరి 25న జిల్లా కేంద్రంలోని అయ్యప్పనగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని వీధి కుక్క కరిచింది. ఆస్పత్రిలో రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన అరగంటలోనే అది వికటించి, చిన్నారి మరణించింది.
గత నెలలో కామారెడ్డి లోని భారత్‌రోడ్‌లో ఇద్దరు మహిళలపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.


