దరఖాస్తు చేసుకోవాలి ఇలా..
మామిడి రైతులకు ఊరట
● ఎకరాకు 8వేల చొప్పున..
● ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు
50 శాతం సబ్సిడీ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : మామిడి రైతులకు అండగా నిలుస్తూ వారిని ప్రొత్సహించేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. మామిడి దిగుబడి చేతికొచ్చే సమయంలో ‘పండు ఈగ’ పంటను ఆశించి దిగుబడిపై తీవ్రప్రభావం చూపుతూ రైతులకు తీరని నష్టాన్ని క లుగజేస్తుంది. దీంతోపాటు ఇతర చీడపీడలు ఆశించి కాయలను రాల్చేస్తుంటాయి. కాయల పై మచ్చలు ఏర్పడి నాణ్యతను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచిరంగు కలిగిఉండి ఎలాంటి మచ్చలు లేకుండా నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చేందుకు ఉపయోగపడే ఫ్రూట్ కవర్లను రైతులకు 50శాతం సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాకు కొంతమేర లక్ష్యాన్ని నిర్ణయించి రైతులకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్లను అందించేందుకు ఉద్యానశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో సాగు
జిల్లాలో ఈ ఏడాది సుమారు 200మంది రైతు లు 2,500 ఎకరాల్లో మామిడిపంటను సాగుచేస్తున్నారు. అయితే ప్రస్తుత ఏడాది మామిడి రై తులకు 50 శాతం సబ్సిడీపై 20ఎకరాల వరకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్లను అందించాలని అధికా రులు లక్ష్యంగా నిర్ణయించారు. ఒక ఎకరాకు సుమారు 8వేల ఫ్రూట్ కవర్లు అవసరమవుతాయని, జిల్లాలో విధించిన లక్ష్యం ప్రకారం 20ఎకరాలకు లక్షా 60వేల కవర్లు అవసరమవుతా యని అధికారులు పేర్కొంటున్నారు.
ఫ్రూట్‌కవర్లపై మామిడిరైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఫ్రూట్‌కవర్లను వినియోగించడం వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుంది. మామిడి రైతులు 50శాతం సబ్సిడీపై ఫ్రూట్‌కవర్లను పొంది చక్కని దిగుబడులు సాధించాలి.
– సంతోషి, ఉద్యానశాఖ అధికారి,
మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రం
మామిడికాయలకు కట్టే ఫ్రూట్ కవర్లు 50 శాతం సబ్సిడీపై పొందాలంటే రైతులు మొదట పూర్తి ధర వెచ్చించి కవర్లను కొ నుగోలు చేయాలి. కొనుగోలు చేసిన కవర్ల కు సంబంధించిన బిల్లులతో కలిపి ఉద్యానశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. కవర్లకు సబ్సిడీ డబ్బులను రైతుల ఖా తాల్లో జమచేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో కవర్ పూర్తి ధర రూ.2.50పైసలుగా ఉంది. ఈ లెక్కన కవర్‌కు రూ.1.25పైసల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.


