కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం

Mar 22 2026 1:34 AM | Updated on Mar 22 2026 1:34 AM

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

మద్నూర్‌(జుక్కల్‌): కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూర్‌, డోంగ్లీ మండల కేంద్రంలో శనివారం శనగ పంట కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు వచ్చిన శనగ పంటకు, కాంటాలకు పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శనగ రైతులకు మద్దతు ధర దక్కాలనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. రూ.5,875 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని, తక్కువ ధరకు దళారులకు పంటను అమ్మి నష్టపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్‌ సాయిలు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పరమేశ్‌ పటేల్‌, నాయకులు సాయిపటేల్‌, సంతోష్‌ మేసీ్త్ర, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement