మద్నూర్(జుక్కల్): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌న్ని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే ఆరోపించారు. మండల కేంద్రంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ మోసపూరితంగా ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ పేరుతో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్‌ను మరిచిందని విమర్శించారు. ఆరు సీజన్‌లకు నాలుగు సీజన్‌ల రైతు భరోసాను ఎగ్గొట్టి రైతులకు మొండిచెయ్యి చూపించిందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్‌లలో జుక్కల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎలాంటి నిధులు తీసుకురాలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయలేదని, ఏ ఒక్క గ్రామానికి బీటీ రోడ్డు వేయలేదని, ఆయనకు మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు కృష్ణపటేల్, పాకాల్ విజయ్, బన్సీ పటేల్, దరాస్ సురేశ్, సుల్తాన్ తదితరులున్నారు.


