నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి):ఉగాది ఉత్సవాలలో భాగంగా మాసాన్‌పల్లిలో శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీపోటీల్లో పాల్గొన్నా రు. కాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన జాదవ్ చరణ్ ఆఖరి కుస్తీపోటీల్లో పాల్గొని రూ.1,500 గెలుచుకున్నారు. ఈ మేరకు విజేతలకు గ్రామసర్పంచ్ సునంద, మాజీసర్పంచ్ అంజాగౌడ్, గ్రామపెద్దలు బహుమతులను అందజేశారు.
కొమలంచలో..
నిజాంసాగర్(జుక్కల్): నల్లపోచమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం మహమ్మద్‌నగర్ మండలం కొమలంచలో కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. గెలుపొందిన మల్లయోధులకు నిర్వాహకులు నాగభూషణంగౌడ్, గంగారెడ్డి నగదును బహుమానంగా అందించారు.


