రాక్‌ కై ్లంబింగ్‌లో విద్యార్థిని ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాక్‌ కై ్లంబింగ్‌లో విద్యార్థిని ప్రతిభ

Mar 21 2026 5:21 AM | Updated on Mar 21 2026 5:21 AM

రాక్‌ కై ్లంబింగ్‌లో విద్యార్థిని ప్రతిభ ఉత్కంఠగా కుస్తీ పోటీలు రైతు డిస్కం అధికారులకు అభినందన

కామారెడ్డి టౌన్‌: భువనగిరిలో నిర్వహించిన శిలారోహణం(రాక్‌ కై ్లంబింగ్‌) శిక్షణలో జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థిని జి.హర్షిత అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు భువనగిరి కోటపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్వతారోహకులు మాలావత్‌ పూర్ణ ఆధ్వర్యంలో రాక్‌ కై ్లంబింగ్‌ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో పాల్గొన్న హర్షిత, కఠినమైన సవాళ్లను అధిగమించి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనే ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించిన ఏకై క విద్యార్థినిగా నిలించింది. హర్షిత ప్రతిభను గుర్తించిన మాలావత్‌ పూర్ణ, స్వయంగా ఆమెకు సర్టిఫికెట్‌ను అందజేసి అభినందించారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థినిని పాఠశాల ప్రిన్సిపాల్‌ మాధవి, ఉపాధ్యాయులు సన్మానించారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): ముంబోజిపేటలో శుక్రవారం ఉగాది ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించినట్లు సర్పంచ్‌ నర్సింలు తెలిపారు. కుస్తీ పోటీలు ఉత్కంఠగా సాగాయి. హోరాహోరీగా మల్లయోధులు తలపడ్డారు. గెలుపొందిన వారికి సర్పంచ్‌, గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు.

జంగమాయిపల్లిలో..

ఎల్లారెడ్డిరూరల్‌: జంగమాయిపల్లిలో శుక్రవారం కుస్తీ పోటీలు జరిగాయి. కుస్తీ పోటీలకు ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్‌. పిట్లం, బిచ్కుంద, జుక్కల్‌, మద్నూర్‌ మండలాలకు చెందిన మల్లయోధులు హాజరయ్యారు. మొదటి బహుమతిగా 3 తులాల వెండి కడియం, ద్వితీయ బహుమతిగా రెండు తులాల వెండి కడియం విజేతలకు అందించారు. సర్పంచ్‌ రాములు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రజిత, కాంగ్రెస్‌ నాయకులు వెంకట్రాంరెడ్డి, కృష్ణాగౌడ్‌, ప్రవీణ్‌ తదితరులున్నారు.

నస్రుల్లాబాద్‌లో..

నస్రుల్లాబాద్‌: నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో శుక్రవారం ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఢిల్లీకి చెందిన బల్జిత్‌ కౌర్‌ అనే మహిళ మరో యువకునితో కుస్తీ పోటీలతో తలపడింది. గెలుపోటములు తేలకపోవడంతో నగదును చెరి సమానం పంచారు. విజేతలకు గ్రామ కమిటీ చైర్మన్‌ మంతపురి సాయిగౌడ్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నందు రెడ్డి, మాజీ సర్పంచ్‌ అరిగే సాయిలు, మాజీ ఎంపీటీసీ శంకర్‌ నాయక్‌, గ్రామస్తులు పాల్గొన్నారు

తిమ్మారెడ్డి గ్రామంలో..

ఎల్లారెడ్డి: తిమ్మారెడ్డి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. చుట్టు పక్క మండలాల మల్లయోధులు కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. సిద్దాపూర్‌కు చెందిన గోపాల్‌ చివరి కుస్తీ పోటీలో నెగ్గి రూ.4 వేల నగదు గెలుచుకున్నట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు గంగారెడ్డి తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: డిస్కం తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబూష్యన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌)ఎస్‌ఈ ఎన్‌.శ్రావణ్‌కుమార్‌, ఏడీఈ కిరణ్‌చైతన్యను జిల్లా విద్యుత్‌ అధికారులు శుక్రవారం కలిశారు. జిల్లాలో పని చేసిన శ్రావణ్‌, కిరణ్‌ ప్రభుత్వం ఉచిత కరెంట్‌ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన డిస్కమ్‌కు బదిలీ అయ్యారు. ఏఈ వెంకటేశ్‌, సబ్‌ ఇంజినీర్లు నవీన్‌, చంద్రకాంత్‌, శ్రీనివాస్‌, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement