డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇలా..
బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు 8.23 శాతం నామమాత్ర మే. కాంగ్రెస్ తన ఎన్నికల హామీల్లో విద్యకు 15శాతం నిధులు కేటాయిస్తామని ప్రకటించి ఆచరణలో విఫలమైంది. పీఆర్‌సీ, ఎస్‌ఎస్‌ఏ, కేజీబీవీల సమస్యలను ప్రస్తవించలేదు.
– బషీర్, టీఆర్‌టీఎఫ్
జిల్లా అధ్యక్షుడు
సబ్బండ వర్గాలకు భరోసా కల్పించే బడ్జెట్‌ను ప్రభు త్వం ప్రవేశపెట్టింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించ డం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు 10.7 శాతం పెరగడం ప్రజాప్రభుత్వ పాలన ప్రగతికి నిదర్శనం. – ఏలే మల్లికార్జున్,
డీసీసీ అధ్యక్షుడు
విద్యారంగాన్ని పూ ర్తిగా నిరాశపర్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూ ళ్లు, పబ్లి క్ స్కూళ్ల ఏర్పాటు మసిపూసి మారేడుకాయ చందంగా ఉంది. టీచర్ల పెండింగ్ బ కాయిల ప్రస్తావన లేదు. విద్యకు 15శాతం నిధులు ఇస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. – ఎండీ ముజీబుద్దీన్,
టీటీయూ, జిల్లా అధ్యక్షుడు
నాణ్యమైన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించే సంకల్పాన్ని ప్రక టించినప్పటికీ కే టాయింపులు ఆశాజనకంగా లేవు. తాజా బడ్టెట్‌లో 26,674 కోట్లు కేటా యించారు. ఇది గత బడ్జెట్ కన్నా 0.65 శాతం ఎక్కువ. ప్రభు త్వం మాటలు నీటి మూటలయ్యాయి.
– కే.వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకులు


