● కామారెడ్డి జిల్లావాసిగా గుర్తింపు
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన దుంపటి వినయ్‌కుమార్(32)గా గుర్తించారు. మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, మృతుడికి నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. గత నెల కవలల దినోత్సవం రోజున పెళ్లయినట్లు సమాచారం.
కరెంట్ షాక్‌తో రైతుకు గాయాలు
మాచారెడ్డి: విద్యుదాఘాతంతో ఓ రైతుకు గాయాలైన ఘటన మండలంలోని గోగుబండ తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన రైతు లక్ష్మీపురం స్వామిదాస్ తన పంట పొలంలో తిరుగుతుండగా విద్యుత్ వైర్లు తగిలి గాయాలయ్యాయి. దగ్గరలో ఉన్న మరో రైతు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించాడు. అంబులెన్స్ సిబ్బంది నరేశ్, ప్రణీత్ ప్రథమ చికిత్స అందించి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.


