గురుకుల పాఠశాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాల తనిఖీ

Mar 9 2026 7:35 AM | Updated on Mar 9 2026 7:35 AM

గురుకుల పాఠశాల తనిఖీ నర్సరీ పరిశీలన నేటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ వాలీబాల్‌ కోర్టు ప్రారంభం ముగిసిన బ్యాడ్మింటన్‌ పోటీలు ఎంపీ షెట్కార్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు మట్టి స్నానాలతో ఆరోగ్య ప్రయోజనాలు

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఆదివారం ఎంపీడీవో నరేష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో సరుకులు, కూరగాయలు పరిశీలించారు. తాజావి తీసుకురావాలని సూచించారు. పాఠశాల తనిఖీ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపనున్నట్లు తెలిపారు.

తాడ్వాయిలో వాహనాలు..

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వారితో పాటు సీటు బెల్టులు, హెల్మెట్లు ధరించని వారికి జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని. చిన్న పిల్లలకు వాహనాలను ఇవ్వవద్దని సూచించారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డి గ్రామ శివారులోని నర్సరీని ఆదివారం ఎంపీడీవో నరేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నర్సరీ నిర్వాహకులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయన వెంట గ్రామ పంచాయతీ పాలక వర్గం, కార్యదర్శి ఉన్నారు.

శివాపూర్‌లో నర్సరీ..

ఎల్లారెడ్డిరూరల్‌: శివాపూర్‌లో నర్సరీని సర్పంచ్‌ నాగరాజు ఆదివారం పరిశీలించారు. నర్సరీలో మొక్కలకు ప్రతి రోజు నీరు పోయాలని, మొక్కలు ఎండకుండా తగిన చర్యలను తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నుంచి మండలంలోని 41 గ్రామ పంచాయతీల వార్డు సభ్యులను శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నరేష్‌ తెలిపారు. మొదటి విడత అయిలాపూర్‌, అయ్యపల్లి, అయ్యపల్లితండా, బాణాపూర్‌, బాణాపూర్‌ తండా, బాయంపల్లి, భవానిపేట, బోనాల్‌, ఎక్కపల్లి, జగదాంబతండా, కన్నాపూర్‌, కోమట్‌పల్లి, కొండాపూర్‌, కొర్పోల్‌, గ్రామాలకు చెందిన 122 మంది వార్డు సభ్యులకు 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.

భిక్కనూరు: బస్వాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కింగ్స్‌ యూత్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ కోర్టును వార్డు సభ్యుడు ఉదయశర్మ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కింగ్స్‌ యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు అంకిత్‌వర్మ, ప్రతినిధులు సుజిత్‌, దావుద్‌, నిహర్‌, ఆది, మధు, మణిచరణ్‌ పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: పట్టణ పరిధిలోని దేవునిపల్లి కాసర్ల విహార్‌లో నిర్వహించిన స్ట్రాంగ్‌ డాటర్స్‌ స్ట్రాంగ్‌ నేషన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కాసర్ల గోదావరి, 10వ వార్డు కౌన్సిలర్‌ కాసర్ల మాధవిలు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఐడీబీఐ మేనేజర్‌ రాజు, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు స్వామి, రవీందర్‌, టోర్నమెంట్‌ నిర్వాహకులు పి.రాఘవేందర్‌రావు, మాజీ కౌన్సిలర్‌ కృష్ణాజీరావు తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడ: జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ను ఆదివారం బీర్కూర్‌ మండల కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. దామరంచ సర్పంచ్‌ బోయిని శంకర్‌ ఆధ్వర్యంలో ఎంపీని కలిసి అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: ప్రతినెలా ఒకసారైనా ఆయుర్వేద వనమూలికలు, పుట్టమన్ను మిశ్రమం శరీరానికి పట్టించి సూర్యరశ్మిలో స్నానం చేస్తే ఆర్యోగ ప్రయోజనాలు చేకూరుతాయని యోగాచార్యులు గరపల్లి అంజయ్య, సహయోగాచార్యులు యెల్లంకి సుదర్శన్‌ అన్నారు. ఆదివారం చిన్నమల్లారెడ్డి కృష్ణమూర్తి రైస్‌మిల్‌ వ్యవసాయక్షేత్రం స్విమ్మింగ్‌పూల్‌ వద్ద యోగా మట్టిసాన్నాల సామూహిక కార్యక్రమం నిర్వహించారు. యోగాసనాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట ఆడి పాటలు పాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement