బోరుమోటార్‌ వైర్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

బోరుమోటార్‌ వైర్లు దగ్ధం

Mar 9 2026 7:35 AM | Updated on Mar 9 2026 7:35 AM

బోరుమోటార్‌ వైర్లు దగ్ధం మత్స్యకారుల ఆందోళనను జయప్రదం చేయండి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేటలో ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నీరు సరఫరా చేసే బోరుమోటార్‌కు సంబంధించిన సర్వీస్‌వైర్‌తోపాటు కేబుల్‌వైర్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామర్పంచ వంశీకృష్ణగౌడ్‌ ఆదివారం ఘటనస్థలానికి చేరుకొని దగ్ధమైన వైర్లను పరిశీలించారు. బోరుమోటార్‌ వైర్లను కావాలనే కాల్చేశారని సర్పంచ్‌ ఆరోపించారు. 5 రోజుల క్రితం సైతం మరో బోరుమోటార్‌కు సంబంధించి కేబుల్‌వైర్‌ను ఎత్తుకెళ్లారని చెప్పారు. గ్రామంలో తాగునీటి నీద్దడి తలెత్తాలనే దురుద్దేశంతోనే గుర్తుతెలియని వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిఘా పెట్టామని, పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

బాన్సువాడ రూరల్‌: ఈ నెల 9న అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద చేపట్టబోయే నిరాహారదీక్షలకు మత్స్యకార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ మత్స్యకారుల సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ కోరారు. ఆదివారం ఆయన తాడ్కోల్‌లో పర్యటించి మత్స్యకార్మికులను సంఘటిత పర్చారు. ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో మత్స్యకార్మిక సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.50 కోట్ల ఎక్స్‌గ్రేషియో విడుదల చేయాలన్నారు. అనంతరం తెలంగాణ మత్స్యకారులు, కార్మికుల సంఘం తాడ్కోల్‌ గ్రామ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బక్కని మౌనిక, ధర్మ రుక్కవ్వ, తోకల అంజవ్వ, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement