బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షి యల్ బాలుర పాఠశాల విద్యార్థి ముజాహిద్ (17) శనివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాసేందుకు ఈ నెల 5న పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న కేంద్రానికి ఆటోలో వెళ్లాడు. పరీక్ష రాసిన తర్వాత తోటి విద్యార్థులతో కలిసి తిరిగి పాఠశాలకు రాలేదు. సాయంత్రం వరకు రాకపోవడంతో ప్రిన్సిపల్ స్వామికు టుంబసభ్యులకు సమాచారం అందించగా, వారు శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం చిన్నదడ్గి వాగులో ముజాహిద్ మృతదేహమై కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతిపై మైనార్టీ స్కూల్ పర్యవేక్షణ జిల్లా అధికారి బషీర్ పాఠశాలలో విచారణ చేపట్టారు. కాగా, విద్యార్థి మృతిపై ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిచ్కుందలో విద్యార్థి కుటుంబసభ్యులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
కోనాపూర్‌లో చోరీ
దోమకొండ: దోమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీబీపేట మండలం కోనాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఇంటి తాళం పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుచ్చవ్వ ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాలోని అర్ధ తులం బంగారు మాటీలు, మూడు మాసాల ఆభరణాలు, 8 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. బాధితురాలి సమాచారం మేరకు శనివారం ఘటనా స్థలాన్ని సందర్శించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


