మద్నూర్(జుక్కల్): మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థి ముజాహిద్ మృతి చాలా బాధాకరమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చిన బిచ్కుంద మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థి, మెక్కా గ్రామానికి చెందిన ముజాహిద్ మృతదేహాన్ని శనివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పరిశీలించారు. ముజాహిద్ మృతిపై ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మద్నూర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్ జాదవ్‌ను ఎమ్యెల్యే పరిస్థితులపై ఆరాతీసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


