మద్నూర్(జుక్కల్): పదో తరగతి తర్వాత విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకోవాలని జిల్లా కస్తూర్బా అధికారి సుకన్య అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో శనివారం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు పదో తరగతి తరువాత ఎలాంటి కోర్సులు ఉంటాయో పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దని, ప్రశాంతంగా చదువుకోని పరీక్షలు రాయాలని ఆమె సూచించారు. ఈకార్యక్రమంలో పీజీహెచ్‌ఎం రాణి, కస్తూర్బా ప్రిన్సిపాల్ సత్యశీల, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.


