కామారెడ్డి టౌన్ : సేవాలాల్ మహరాజ్ ఆశయాలను కొనసాగించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బంజారా సమాజం సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గిరిజన తండాల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బంజారులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ, బంజారా సంఘం నాయకులు పాల్గొన్నారు.


