ఏటీఎంలు వెలవెల
డిజిటల్ చెల్లింపులు పెరగడం కారణంగా డబ్బులు డ్రా చేసుకునే వారు తగ్గిపోవడంతో ఏటీఎంలు వెలవెలబోతున్నాయి. దీంతో ఏటీఎంలలో ప్రతీ రోజూ డబ్బులు పెట్టే ఏజెన్సీలకు కూడా పని తగ్గిపోయింది. ఇంకొన్ని చోట్ల డబ్బులు తీసుకునేవారు లేక ఆయా బ్యాంకులు ఏటీఎంలలో డబ్బులు జమ చేయడం తగ్గించేశాయి. ఒకటిరెండు కార్పొరేట్ బ్యాంకులైతే ఏటీఎంలను తొలగించేస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు కార్పొరేట్ బ్యాంకులకు సంబంధించి 139 బ్రాంచీలు ఉన్నాయి. ఆయా బ్యాంకులు సుమారు 98 చోట్ల ఏటీఎంలను ఏర్పాటు చేశాయి. అప్పట్లో ఏటీఎంల ద్వారా ప్రతీరోజూ రూ. కోట్లు డ్రా అయ్యేవి. ప్రజల అవసరాలు పెరగడంతో ఆయా బ్యాంకులు ఏటీఎంలను విస్తరించాయి. ప్రధాన కూడళ్ల వద్ద, బ్యాంకుల వద్ద, అలాగే కాలనీలలో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేశాయి. గతంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా బ్యాంకుల ఏటీఎంల ద్వారా ప్రతీ నెలలో కనీసం రూ.350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు డబ్బులు డ్రా అయ్యేవని అంచనా. ఇప్పుడు రూ. వంద కోట్లు కూడా డ్రా జరగడం లేదని తెలుస్తోంది. కొన్ని ఏటీఎంలలో 50 శాతం నుంచి 70 శాతం దాకా తగ్గిపోయింది. మరికొన్ని చోట్ల 50 శాతం మేర తగ్గిపోయాయి.
డెబిట్ కార్డులున్నా
ఉపయోగించని జనం
భారీగా తగ్గిన నగదు వాడకం
డిజిటల్ లావాదేవీలకే
మొగ్గుచూపుతున్న వైనం
ఏటీఎంలు వెలవెల


