వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ | - | Sakshi
Sakshi News home page

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ

Feb 20 2026 6:44 AM | Updated on Feb 20 2026 6:44 AM

వీరత్

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ

కామారెడ్డి టౌన్‌: ఛత్రపతి శివాజీ మహారాజ్‌ భారత జాతి వీరత్వానికి ప్రతీక అని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కొనియాడారు. పట్టణంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇంటర్నేషనల్‌ హోటల్‌ సమీపంలో ఉన్న శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే గొప్ప ధీరుడు శివాజీ అని, ఆయన పోరాట పటిమ తరతరాలకు దిక్సూచిలా నిలుస్తుందన్నారు. బీజేపీ కౌన్సిలర్లు నాయకు లు నరేందర్‌రెడ్డి, మోటూరి శ్రీకాంత్‌, శ్రీధర్‌రెడ్డి, విపు ల్‌, మధు, అరవిందరాజ్‌, ప్రీతి, ప్రయాంక, రాణి, రంజిత్‌, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బీబీపేటలో భారీ ర్యాలీ..

బీబీపేట: మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డా. మాసానిపల్లి పెరమాండ్లు అధ్వర్యంలో గురువారం రాత్రి శివాజీ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు ఛత్రపతి శివాజీ వేషధారణలతో, గుర్రాలపై గ్రామంలోని ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ1
1/2

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ2
2/2

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement