ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఈనెల 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ పద్మతో కలిసి చీ ఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్‌లతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రథమ సంవత్సరం 9,013 మంది, ద్వితీయ సంవత్సరం 8,940 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకా నున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం కస్టోడియన్లు, సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరీక్షలను విజయవంతం చేయాల ని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు.


