త్వరలోనే పట్టుకుంటాం
హత్య కేసుల్లో విచారణ వేగవంతం చేశాం. శరీర భాగాలు లభించిన కేసును అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్నాం. బస్టాండ్‌లో జరిగిన హత్య కేసులో నిందితుడి కోసం గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం.
– నరహరి, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి
పోలీసు శాఖలో సాంకేతిక విజ్ణాన విని యోగం ఇటీవల చాలా పెరిగింది. ఎలాంటి కేసునైనా తక్కువ వ్యవధిలో ఛేదించగల పరిజ్ణానం అందుబాటులో ఉంది. అయినా జిల్లా కేంద్రంలో ఇటీవల వెలుగు చూసిన రెండు హత్య కేసులు పోలీసులకు సవాల్‌గా మారాయి. కొత్త బస్టాండ్‌లో జరిగిన వ్యక్తి హత్య కేసు మరి కొద్ది రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నా.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి మూటల్లో పడేసిన కేసును ఛేదించడం అంత సులభం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రెండు కేసుల్లో పోలీసులకు భిన్నమైన
సవాళ్లు ఎదురయ్యాయి. శరీర భాగాలు లభ్యమైన కేసులో మృతుడెవరో తెలిస్తే గానీ కేసు ముందుకు సాగదు. బస్టాండ్‌లో చోటు చేసుకున్న కేసు దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ నిందితుడిని పట్టుకుంటే గానీ హతుడు ఎవరో తెలిసేలా లేదు. ఘటనా స్థలంలో ఏం జరిగిందో సీసీ ఫుటేజీలో కనిపిస్తున్నా మృతుడి వివరాలు తెలియలేదు. అతడిపై దాడి చేసిన వ్యక్తి సెల్‌ఫోన్, నగదు ఎత్తుకుపోయాడు. ఎంతమందిని విచారించినా చనిపోయిన వ్యక్తి వివరాలు లభించడం లేదు. నిందితుడు ఎత్తుకుపోయిన సెల్‌ఫోన్ లోనే మృతుని వివరాలు ఉండే అవకాశాలున్నాయి. నిందితుడు పట్టుబడితేనే ఈ కేసు కొలిక్కి రావొచ్చు. ఈ రెండు హత్య కేసులు పట్టణ పోలీసులకు తలనొప్పిగా మారాయి.
మృతుడి మిగతా శరీర భాగాల కోసం గాలింపు(ఫైల్)
జిల్లా కేంద్రంలో మిస్టరీ మర్డర్లు
పదిరోజుల వ్యవధిలో రెండు హత్యలు
చిక్కుముడి వీడని కేసులు
చెమటోడుస్తున్న
ప్రత్యేక పోలీసు బృందాలు
సవాల్‌గా మారిన ఘటనలు


