వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం | - | Sakshi
Sakshi News home page

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం

Feb 19 2026 9:57 AM | Updated on Feb 19 2026 9:57 AM

వేసవి

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం రూ.8 లక్షల నగదు చోరీపై విచారణ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక ఉద్యాన రైతులకు రాయితీపై ప్లాస్టిక్‌ క్రేట్లు

కామారెడ్డి టౌన్‌: వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్‌ బెడ్‌ను మున్సిపల్‌ అధికారులు, కౌన్సిలర్‌లతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఫిల్టర్‌ బెడ్‌ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, అంతరాయం లేని వి ద్యుత్‌ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి, ఏఈ వేణుప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. కౌన్సిలర్లు, నాయకులు అన్వర్‌, గణేశ్‌, భాస్కర్‌గౌడ్‌, మహేశ్‌, అంజాద్‌, లడ్డు, భూపతి, గంగాధర్‌, వాజిద్‌, లోలం శ్రీనివాస్‌, జెర్సీ నర్సింహులు, లక్ష్మణ్‌, కె లలిత, బబ్లూ, మాజీద్‌, జావెద్‌, యూనుస్‌, సిద్దిఖ్‌, గ్యార సాయిలు తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడ : పట్టణంలో పార్కింగ్‌ చేసిన కారు అద్దాలు పగులగొట్టి రూ.8 లక్షల నగదు ఎత్తుకెళ్లిన ఘటనపై సీసీఎస్‌ బృందం విచారణ చేపట్టింది. హస్గుల్‌కు చెందిన యాదవ్‌రావు మంగళవారం ఎస్‌బీఐ నుంచి రూ.8 లక్షలు డ్రా చేసుకుని కారులో పెట్టుకున్నాడు. బ్యాంక్‌ నుంచి బయల్దేరిన యాదవ్‌రావు తనకారును పార్క్‌ చేసి రిలయన్స్‌ మార్ట్‌కు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీఎస్‌ పోలీసులు బాధితుడి గ్రామమైన హస్గుల్‌కు వెళ్లి విచారించారు. కారుపై నిందితుడి ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించారు. ఈ చోరీలో మరో ఇద్దరు వ్యక్తుల హస్తం ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా స్పష్టం కావడంతో ఆ దిశగా విచారణ చేపడుతున్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన అబ్దుల్‌ సమీర్‌, మద్ది విశాల్‌రెడ్డి అండర్‌ – 21 వాలీబాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు పంబల్ల సతీశ్‌, సీనియర్‌ క్రీడాకారుడు మిద్దెస్వామి, పీఈటీ బాలయ్య బుధవారం తెలిపారు. వేములవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు కు ఇద్దరు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహి స్తారన్నారు. గ్రామపెద్దలు, క్రీడాకారులు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

కామారెడ్డి అర్బన్‌: జిల్లాలో కూరగాయలు,పండ్లతోటలు సాగుచేసే రైతులకు ఉద్యాన పరిశ్రమ శాఖ 50శాతం రాయితీపై ఒక్కొ రైతుకు గరిష్టంగా 40 ప్లాస్టిక్‌ క్రేట్లు అందజేయనున్నట్టు జిల్లా ఉద్యాన అధికారిణి జ్యోతి తెలిపారు. ఒక్కో క్రేట్‌ అసలు ధర రూ.337 కాగా, ప్రభుత్వం రాయితీపై రూ.169కి అందజేస్తోందన్నారు. రైతులు తమ భూ మి పాస్‌బుక్‌, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌లు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోతో డీహెచ్‌ఎస్‌వో కామారెడ్డి పేరిట డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీసి సమీప ఉద్యావన అధికారులను సంప్రదించి పొందవచ్చని తెలిపారు.

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం1
1/2

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం2
2/2

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement