నేరాల నియంత్రణకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

Feb 19 2026 9:57 AM | Updated on Feb 19 2026 9:57 AM

నేరాల

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

గ్రేవ్‌ కేసుల దర్యాప్తును

వేగవంతం చేయాలి

నెలవారీ సమీక్షలో ఎస్పీ రాజేశ్‌చంద్ర

సమీక్ష సమావేశానికి హాజరైన పోలీసులు అధికారులు మాట్లాడుతున్న ఎస్పీ రాజేశ్‌చంద్ర

కామారెడ్డి క్రైం: నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ రాజేష్‌ చంద్ర పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నెలవారీ నేర సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. స్టేషన్‌ల వారీగా కేసుల వివరాలు, విచారణ, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తీవ్రమైన నేరాల్లో (గ్రేవ్‌) కేసుల పరిష్కారంలో దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. వేసవిలో బీట్లు, గస్తీ పెంచి దొంగతనాల నివారణపై దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలని ఎస్‌హెచ్‌వోలకు సూచించారు. గ్రామ పోలీసు అధికారులు సమాచార సేకరణలో కీలకంగా ఉండాలన్నారు. రౌడీ, సస్పెక్ట్‌ షీటర్లపై నిఘా సారించాలని, అనుమానిత వ్యక్తుల ఫింగర్‌ ప్రింట్‌లను సేకరించాలని అన్నారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నిత్యం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టాలని, పట్టణ ప్రాంతాల్లో బీట్‌ సిస్టమ్‌ను మరింత పట్టిష్టం చేయాలన్నారు. రంజాన్‌ వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు కృషి చేయాలి1
1/1

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement