షబ్బీర్‌ అలీ కుటుంబంపై అబద్ధాల ప్రచారం | - | Sakshi
Sakshi News home page

షబ్బీర్‌ అలీ కుటుంబంపై అబద్ధాల ప్రచారం

Feb 19 2026 9:57 AM | Updated on Feb 19 2026 9:57 AM

షబ్బీర్‌ అలీ కుటుంబంపై అబద్ధాల ప్రచారం

షబ్బీర్‌ అలీ కుటుంబంపై అబద్ధాల ప్రచారం

వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోం

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు

ఐరేని సందీప్‌

కామారెడ్డి టౌన్‌ : పదవిలో ఉన్నా, లేకున్నా కామారెడ్డి నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించే షబ్బీర్‌ అలీపైనా, ఆయన కుటుంబంపైనా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసత్యపు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్‌ ఆరోపించారు. బుధవారం ఆయన పార్టీ నేతలు గుడుగుల శ్రీనివాస్‌, సుతారి రమేశ్‌ తదితరులతో కలిసి మాట్లాడుతూ... నాలుగు దశాబ్దాల కాలంగా షబ్బీర్‌అలీ కామారెడ్డి నియోజక వర్గంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యనే ఉన్నాడన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా షబ్బీర్‌అలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ ప్రజలకు అండగా నిలిచి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. షబ్బీర్‌అలీ తనయుడిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ఎమ్మెల్యే ప్రజానాయకుడిపై ఇష్టమున్నట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. కామారెడ్డి అభివృద్ధిని విస్మరించాడని ఆరోపించారు. రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రజల్ని వంచించాడన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఐటీ రిటర్న్‌ రూ.4 లక్షల 91 వేలు కట్టేవాడివి రూ.150 కోట్లు ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికై నా తప్పుడు ఆరోపణలు, అసత్యపు ప్రచారాలు మానుకుకోవాలని హితవు పలికారు. షబ్బీర్‌అలీపై, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement