రేషన్ డీలర్లు ఈ–కేవైసీ తప్పక చేయాలి
పిట్లం(జుక్కల్): రేషన్ డీలర్లు తప్పకుండా ఈ–కేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ మహేందర్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆయన శుక్రవా రం తహసీల్ కార్యాలయంలో మాట్లాడారు. రేషన్ లబ్ధిదారులకు ఈ– కేవైసీ చేయాలని సూచించారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను ఇప్పిస్తున్నామని ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల సిద్దిరాములు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నాయకులు మహేందర్ రెడ్డి, సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగాధర్, గ్రామ అ ధ్యక్షుడు గంగారాజం,తదితరులుపాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు రూ.12 వేల తో నూతనంగా టీవీని కొనుగోలు చేసి పాఠశాలలో ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం కాంప్లెక్స్ హెచ్‌ఎం వసుధ ప్రారంభించారు. టీవీ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ విద్యను ప్రోత్సహించాలన్నారు. పలు పాఠశాలలను పరిశీలించారు.ప్రధానోపాధ్యాయులు నవ్యభాను, మహిపాల్ పాల్గొన్నారు.


