భళా.. బాల శాస్త్రవేత్తలు
● రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌లో
ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ (విద్యా వైజ్ఞానిక ప్రదర్శన) సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపుతూ, అభివృద్ధి దిశగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆలోచింపజేస్తున్నా యి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు.
యాదాద్రి జిల్లా గూడూరు జెడ్పీహెచ్‌ఎస్ 8వ తరగతి విద్యార్థి హర్షవర్థన్ ‘మానవ రహిత చేపల వేట’ ప్రాజెక్టును ప్రదర్శించాడు. రిమోట్‌తో నడిచే ఈ బోటును డ్రైవర్ లేకుండానే చెరువులు, సముద్రాల్లోకి పంపవచ్చు. పడవకు అమర్చిన వలల ద్వారా ఆటోమేటిక్‌గా చేపలను పట్టి లోపల వేసుకోవచ్చు. ప్రాణహాని కలగకుండా ఉపయోగపడుతుందని గైడ్ టీచర్ శ్రీనివాస్ తెలిపారు.


