ఫార్మా ఫ్యాక్టరీ పెట్టొద్దు
భిక్కనూరు: మండల కేంద్ర శివారులోని సర్వేనంబర్ 677లో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.
ఫార్మా కంపెనీల ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో ఆస్పత్రుల సంఖ్య పెరుగుతుందే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫార్మా కంపెనీ అనుమతులన్నింటిని రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తాం
–గజ్జెల భిక్షపతి, న్యాయవాది, భిక్కనూరు
ఫార్మా ఫ్యాక్టరీ పెట్టొద్దు


