కాంగ్రెస్‌లో పలువురి చేరిక | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

Jan 8 2026 7:12 AM | Updated on Jan 8 2026 7:12 AM

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

కాంగ్రెస్‌లో పలువురి చేరిక ప్రార్థన మందిరాన్ని తొలగించాలి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని 9, 10, 11, 12, 34, 35 వార్డులకు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేష్‌ షెట్కార్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్‌ శ్రీనివా స్‌రావు, నాయకులు పండ్ల రాజు, నరేష్‌, రవి తదితరులు ఉన్నారు.

కామారెడ్డి టౌన్‌: పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీ లో నిబంధనలకు విరుద్ధంగా గృహాల మధ్య ఏర్పా టు చేసిన ప్రార్థన మందిరాన్ని తొలగించాలని కో రుతూ బుధవారం కాలనీవాసులు కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కాలనీవాసులు శ్రీనివాస్‌, నర్సింలు, రంజిత్‌, సతీష్‌, సాయికృష్ణ, మంజుల, బాలమణి, బాగ్యశ్రీ, సాయికిరణ్‌, వంశీ తదితరులున్నారు.

మాచారెడ్డి: పాల్వంచ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం గోవర్డన్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు పవిత్ర, వర్ధిని, అస్మిత, దుర్గాలక్ష్మి, వినోదలు పిట్లం మండలం చిల్లర్గిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పీడీ అథీక్‌ ఉల్లా, విద్యార్థులను బుధవారం అభినందించారు.

కామారెడ్డి అర్బన్‌: రాష్ట్రస్థాయి జూనియర్స్‌ హాకీ పోటీలకు గర్గుల్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు వీణ, భవానీ, రోహిత్‌, తులసికుమార్‌, సతీష్‌ ఎంపికయ్యారు. పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారిని ఇన్‌చార్జి హెచ్‌ఎం వీరబ్రహ్మం, పీఈటీ నోముల మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

వాలీబాల్‌ కిట్‌ పంపిణీ

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 13వ వార్డ్‌ టేక్రియాల్‌ యువకులకు బుధవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వాలీబాల్‌ కిట్‌ను అందజేశారు. కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement