‘ఎజిటేషన్ బ్యాచ్’ సమ్మేళనం
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల 1968–69 హెచ్‌ఎస్‌సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పట్టణంలోని దత్తాశ్రమంలో సమావేశమయ్యారు. 65 మంది ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. అప్పట్లో హెచ్‌ఎస్‌సీలో ఐదు సెక్షన్లు ఉండేవని వారు పేర్కొన్నారు. సమ్మేళనంలో సగం మంది పాల్గొని, రోజంతా ఉల్లాసంగా గడిపారు. కాగా తామంతా 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని వారు తెలిపారు. ఉద్యమం కారణంగా ఏప్రిల్‌లో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్‌లో జరిగాయని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందున ఈ బ్యాచ్‌ను ఎజిటేషన్ బ్యాచ్ అని పిలుస్తారు. ఈ బ్యాచ్‌లోని చాలామంది ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు.


