ప్రచార జోరు
న్యూస్‌రీల్
● రంగంలోకి ముఖ్య నేతలు
● సాధారణ ఎన్నికలను తలపిస్తున్న వాతావరణం
– 9లో u
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. తొలి, మలి విడతల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడో విడతకు సంబంధించి ఉపసంహరణ ఘట్టం మిగిలి ఉంది. తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాలలో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కగా.. రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క శనివారం తేలడంతో వారు ప్రచార రంగంలోకి దిగారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆయా పార్టీల ముఖ్యనేతలంతా పల్లె పోరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో తమ పార్టీకి చెందినవారిని గెలిపించుకునేందుకు రంగంలోకి దిగారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు కొందరు ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. మరికొందరు కుల సంఘాలు, యువజన సంఘాల నేతలను తమ దగ్గరకు పిలిపించుకుని మద్దతు కూడగడుతున్నారు. ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో పంచాయతీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది.
● కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించేందుకు ఆయా గ్రామాల పెద్ద మనుషులను తన వద్దకు రప్పించుకుని వారి మద్దతు కూడగడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తమ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. పలు గ్రామాల ప్రజలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. వీడియో సందేశాన్ని సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తమ పార్టీకి చెందిన వారి గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
● జుక్కల్ నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలాగే ఆయన గ్రామాలకు వెళ్లి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే బీఆర్‌ఎస్ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ మద్దతుదారుల తరపున మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార వివిధ వర్గాల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
● బాన్సువాడ నియోజకవర్గంలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన గ్రామాలకు వెళ్లి వివిధ వర్గాల వారితో మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ కూడా తిరుగుతున్నారు. బీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ నేతలతో పలుమార్లు సమావేశమయ్యారు. పార్టీ మద్దతుదారులను గెలిపించాలని కోరుతున్నారు.
● ఎల్లారెడ్డి నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులను గెలిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఓట్ల వేటలో అభ్యర్థులు..
తొలి, మలి విడతల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోపక్క కులాలు, సంఘాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ తేదీలు సమీపిస్తుండడంతో అంతటా ఎన్నికల గురించిన చర్చ నడుస్తోంది.
మండలం సర్పంచ్ ఏకగ్రీవం ఎన్నికలు అభ్యర్థులు వార్డులు ఏకగ్రీవం ఎన్నికలు అభ్యర్థులు
స్థానాలు జరిగేవి జరిగేవి
గాంధారి 45 16 29 86 366 257 109 244
లింగంపేట 41 14 27 109 342 194 148 512
నాగిరెడ్డిపేట 27 06 21 70 232 103 129 282
ఎల్లారెడ్డి 31 04 27 75 246 141 105 223
మహ్మద్‌నగర్ 13 01 12 34 112 35 77 181
నిజాంసాగర్ 14 01 13 37 122 21 101 202
పిట్లం 26 01 25 71 234 27 203 454
మొత్తం 197 43 154 482 1,654 778 872 2,098
(పిట్లం మండలంలోని బ్రాహ్మణపల్లిలో నాలుగు వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు)
ప్రచార జోరు
ప్రచార జోరు
ప్రచార జోరు


