నేడు‘సాగర్‌’ నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

నేడు‘సాగర్‌’ నీటి విడుదల

Dec 8 2025 7:56 AM | Updated on Dec 8 2025 7:56 AM

నేడు‘

నేడు‘సాగర్‌’ నీటి విడుదల

నిజాంసాగర్‌ : యాసంగి పంటల సాగు అవ సరాల కోసం సోమవారం ఉదయం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారు దల శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నందన ప్రధాన కాలువ వైపు రైతులు త మ పశువులను తీసుకెళ్లవద్దని వెల్లడించారు.

ఓటింగ్‌లో పాల్గొనం

రామారెడ్డి: ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉండాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని గోకుల్‌ తండా పంచాయతీ పరిధిలోని కింది తండావాసులు స్పష్టం చేశారు. గోకుల్‌ తండా పంచాయతీ పరిధిలో మీదితండాలో 350 ఓట్లు, కింది తండాలో 250 ఓట్లున్నా యి. ఓటర్లు ఎక్కువగా ఉన్న తండావాసులు తమకు సర్పంచ్‌ అవకాశం దక్కకుండా చూ స్తున్నారని, ఆ తండాలో రూ. 13.52 లక్షల కు వేలం నిర్వహించి ఒక్క అభ్యర్థినే బరిలో నిలిపారని ఆరోపిస్తూ ఎన్నికలలో పాల్గొనబోమని కింది తండావాసులు తేల్చిచెప్పా రు. విషయం తెలుసుకున్న ఆర్డీవో వీణ ఈ నెల 5న తండాకు వెళ్లి మాట్లాడినా ఫలితం లేకపోయింది. ఆదివారం మరోసారి సమావేశమైన కింది తండావాసులు.. తమ తండాలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తేనే ఓట్లు వేస్తామని, లేకపోతే ఎన్నికలలో పాల్గొనబోమని స్పష్టం చేశారు.

అయితే కింది తండాకు చెందిన ఇద్దరు సర్పంచ్‌ బరిలో ఉండడం గమనార్హం. కింది తండావాసులు పోలింగ్‌లో పాల్గొనేందుకు అధికారులు ఏ చర్యలు తీసుకుంటారోనన్న దానిపై ఆసక్తి నెలకొంది.

‘సమాజం గురించి

ఆలోచించేవారు చిరంజీవులు’

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సమాజం గురించి ఆలోచించే వారిని ప్రజలు ఎన్నడూ మరిచిపోరని ప్రముఖ వైద్యుడు జయచందర్‌ పేర్కొన్నారు. కామారెడ్డికి చెందిన దివంగత జర్నలిస్టు దయానంద్‌ పేరిట ఆయన మిత్ర బృందం సీనియర్‌ జర్నలిస్టు పున్నంచంద్‌కు అరిమిశెట్టి దయానంద్‌ స్మారక పురస్కారాన్ని అందించింది. ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జయచందర్‌ మాట్లాడుతూ సమాజం గురించి పనిచేసే వారు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం, నడక, యోగాకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో దయానంద్‌ మిత్ర బృందం, పుస్తకలోకం ప్రతినిధు లు కే.శ్రీనివాస్‌, కే.శ్యాంరావ్‌, జగన్నాథం, డాక్టర్‌ అయాచితం శ్రీధర్‌, డాక్టర్‌ వీఆర్‌ శర్మ, టి.హన్మాండ్లు, కే. వేణుగోపాల్‌, సీహె చ్‌ అనిల్‌కుమార్‌, మధుసూదన్‌, నారాయ ణ, రాములు, కిషన్‌గౌడ్‌, ప్రభాకర్‌, దయానంద్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజల మెప్పుపొంది

గర్వంగా నిల్చున్నాం

నిజామాబాద్‌ రూరల్‌: అభివృద్ధి, సంక్షేమంలో తమ ప్రభుత్వం ప్రజలతో శభాష్‌ కొట్టించుకుంటోందని, వారి మెప్పు పొంది గర్వంగా నిల్చున్నామని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టని కిషన్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ నాయకులు మహాధర్నా పేరిట ప్రజలను మోసం చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. కేసీఆర్‌ రూ.8 లక్షల కోట్ల అప్పుతో రాష్టాన్ని కాంగ్రెస్‌కు అప్పగించారని, తాము ఒకవైపు వడ్డీలు కడుతూ.. మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అయినప్పటికీ వచ్చే మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఆయనవెంట డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, నుడా చైర్మన్‌ కేశవేణు, నరాల రత్నాకర్‌, పార్టీ నాయకులు ఉన్నారు.

నేడు‘సాగర్‌’ నీటి విడుదల
1
1/2

నేడు‘సాగర్‌’ నీటి విడుదల

నేడు‘సాగర్‌’ నీటి విడుదల
2
2/2

నేడు‘సాగర్‌’ నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement