జాబితా.. తప్పుల తడక
బైరాపూర్‌లోనే ఓటు వేస్తా..
● ఒకే వ్యక్తికి రెండు గ్రామాల్లో ఓటు హక్కు
● చనిపోయిన వారి పేర్లూ ఓటరు జాబితాలో..
● బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన నీరడి శేఖర్‌కు గ్రామ ఓటరు జాబితాలో (ఇంటి నం.1–3) ఒకటో వార్డు 17 క్రమసంఖ్యలో అతడి పేరు ఉంది. ఇదే వ్యక్తికి బీర్కూర్‌లోని ఇంటి నంబర్ 1–3లోని ఒకటో వార్డు క్రమ సంఖ్య 24లో ఓటు వచ్చింది. ఒకే వ్యక్తికి ఇటు బైరాపూర్ లో, అటూ బీర్కూర్‌లో ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఈ గ్రామంలో ఏళ్ల కింద చనిపోయిన వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండటం విశేషం.
బాన్సువాడ : పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా జాబితా తయారు చేశారు. దీంతో రెండు, మూడేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తుల పేర్లు కూడా ఓటరు జాబితాలో అలాగే ఉన్నాయి.
సవరణకు అవకాశం ఇచ్చినా..
గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గ పదవీకాలం ముగిసింది. వీటికి ఎన్నికల నిర్వహించేందుకు 2024 సెప్టెంబర్ నుంచే ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. జిల్లా అధికారులతో 2024 అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటరు జాబితా ఆధారంగా ముసాయిదా జాబితా రూపొందించారు. అక్టోబర్ 1న తు ది జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం బీర్కూర్ మండల కేంద్రంలో 7,044 ఓటర్లు ఉ న్నారు. పలు కారణాలతో ఎన్నికలు వాయిదా ప డగా 2025 జూన్ నుంచి కసరత్తు చేస్తూ సెప్టెంబర్‌లో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను మరొ సారి ప్రకటించింది. మార్పులు, చేర్పులకు అవకా శం ఇచ్చినా బీఎల్‌వోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పొరపాట్లు చోటు చేసుకున్నాయి. కొత్త ఓటర్లు పెరిగారు కానీ మరణించిన వారి ఓట్లు తొలగించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ వ్యక్తికి బైరాపూర్‌తోపాటు బీర్కూర్‌లోనూ ఓటు హక్కు కల్పించారు. మరణించినవారి ఓట్లూ జాబితాలో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు ఓటరు జాబితాను చూసి తలలు పట్టుకుంటున్నారు.
మాది బైరాపూర్ గ్రామం. ఇక్కడే పుట్టిన. బైరాపూర్‌లో నే ఓటు ఉంది. ఈసారి పంచాయతీ ఎన్నికల జాబితా లో బీర్కూర్‌లో ఓటు ఉన్న ట్లు తెలిసింది. అక్కడ నా పే రుతో ఓటు ఎలా వచ్చిందో తెలియదు. సొంతూరు బైరాపూర్‌లోనే ఓటు వేస్తా. – శేఖర్, బైరాపూర్‌వాసి
జాబితా.. తప్పుల తడక
జాబితా.. తప్పుల తడక
జాబితా.. తప్పుల తడక


