వృద్ధురాలి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బీరవ్వ గత కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. ఈ విషయమై తరచు ఆవేదన చెందేది. ఈక్రమంలో శుక్రవారం ఉదయం జీవితంపై విరక్తి చెంది ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గ్రామంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి, కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు.
మాక్లూర్: ఉపాధి కోసం దుబాయి దేశానికి వెళ్లిన మండలంలోని గొట్టుముక్కల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా.. గొట్టుముక్కల గ్రామానికి చెందిన యాస సురేశ్ (35) ఉపాధి కోసం 25 రోజుల క్రితం దుబాయిలోని ఓ కంపెనీలో కూలీ పని చేయడానికి వెళ్లాడు. శనివారం అతడు అక్కడ విధుల్లో చేరాల్సి ఉంది. కానీ గురువారం అతడు ఆ దేశంలో రోడ్డు దాటుతుండగా ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబీకులు బోరున విలపించారు. మృతుడి కుటుంబసభ్యులు నిరుపేదలు కావడంతో ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వృద్ధురాలి ఆత్మహత్య


