ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ ఆర్చరీ పోటీలు
● రాష్ట్రస్థాయి పోటీలకు
పలువురు క్రీడాకారుల ఎంపిక
దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈపోటీలను ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి గంగరాజు, కామారెడ్డి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుమల గౌడ్ ప్రారంభించారు. అర్చరీ సబ్ జూనియర్ ఇండియా రౌండ్ బాలుర విభాగంలో భువన్, శ్రీశాంత్, రాజేందర్, రామ్‌చరణ్ , ప్రణీత్ పతకాలు సాఽధించారు. బాలికల విభాగంలో ప్రీతి, లాస్య, సౌమ్య, స్నేహ, భావన, శ్రీవర్చనతో పాటు రికర్వు రౌండ్ బాలుర విభాగంలో సుమంత్,స్నేహిత్,రుత్విక్, బాలికలు విభాగంలో ఇందు, వర్షిణి, నక్షత్ర, నైతిక, అర్చిత పతకాలు సాధించారు. అదేవిధంగా అండర్–10 విభాగంలో వర్షిత, అండర్ 19 బాలుర విభాగంలో రాజేందర్, దీక్షిత్, రిత్విక్, బాలికల విభాగంలో అమూల్య, సుమిత్ర, అశ్విని, రికర్వు రౌండ్ అండర్–14 బాలుర విభాగంలో రుత్విక్, స్నేహిత్, బాలికల విభాగంలో వర్షిని, నక్షత్ర, నైనిక, అర్చిత, కాంపౌండ్ రౌండ్ కృష్ణసాయి ఎంపికయ్యారు. ఈ నెల 9న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వీరు ఎంపికై నట్లు కోచ్ ప్రతాప్‌దాస్ తెలిపారు. పోటీలకు సహాయసహకారాలు అందించిన జాతీయ అర్చరీ అసోసియేషన్ అఽధ్యక్షుడు కామినేని అనిల్‌కుమార్, గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ, కామారెడ్డి అసోసియేషన్ సెక్రటరీ మోహన్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, గంగాధర్ , వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయ, సురేఖ,రవీందర్, తదితరులు పాల్గొనారు.
రాష్ట్రస్థాయి విలువిద్య క్రీడాకారులకు సన్మానం
రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఇద్దరు క్రీడాకారులను శుక్రవారం గడికోటలో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు. దోమకొండకు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపారు. మహబూబాబాద్ లో నిర్వహించిన విలువిద్య రికర్వు రౌండ్ పోటీల్లో బి. ఇందు అండర్–17 విభాగంలో వెండి పతకం సాధించగా, బి. వర్షిణి అండర్–14 విభాగంలో కాంస్య పతకం సాధించింది. దీంతో వీరిని సన్మానించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని కోచ్ ప్రతాప్‌దాస్ తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా ఆర్చరి అసోసియేషన్ అధ్యక్షుడు తిర్మల్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ పన్యాల నాగరాజ్‌రెడ్డి, నాయకులు అండెం శంకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రవి, రాములు, కమ్మరి గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ ఆర్చరీ పోటీలు


