మాలావత్ పూర్ణకు పితృ వియోగం
సిరికొండ: అతిపిన్న వయస్సులో ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలావత్ పూర్ణకు పితృ వియోగం కలిగింది. పూర్ణ తండ్రి మాలావత్ దేవిదాస్ కొన్ని నెలల కిందట కోమాలోకి వెళ్లారు. కామారెడ్డిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతుడికి భార్య లక్ష్మీతో పాటు కూతురు పూర్ణ, కొడుకు నరేష్ ఉన్నారు. పూర్ణ స్వగ్రామం సిరికొండ మండలంలోని పాకాల లో ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ జగన్ ఫోన్‌లో పూర్ణాను పరామర్శించినట్లు గ్రామస్తులు తెలిపారు.
మాలావత్ పూర్ణకు పితృ వియోగం


