ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సమీక్ష
కామారెడ్డి అర్బన్: చిన్నమల్లారెడ్డి, లింగాయపల్లిలలో జిల్లా పరిషత్ సీఈవో చందర్ శుక్రవారం పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకుంటే వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తారని సీఈవో పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
త్వరగా పూర్తి చేయాలి
బాన్సువాడ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని బీర్కూర్ ఎంపీడీవో శ్రీనిధి తెలిపారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్, వీరాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఈవో సందర్శించారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని పాఠశాలలో వందేమాతం గేయాన్ని ఆలపించారు. సూపరింటెండెంట్ భానుప్రకాష్, గ్రామ పంచాయితీ కార్యదర్శిలు దివ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తాడ్వాయి మండలంలో
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను వేగ వంతం చేయాలని ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ అన్నారు. ఆయన మండలంలోని కన్‌కల్, కరడ్‌పల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ చేశారు. గ్రామ కార్యదర్శులు, జీపివోలు, సీసీలు, వీవోఏలు, మహిళసంఘాల అద్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట మండలంలో
రాజంపేట: మండల కేంద్రంతో పాటు నడిమి తండా, షేర్ శంకర్ తండా, కొండాపూర్ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మర్కౌట్ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం రాజంపేట, ఆరెపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో ఏపీవో, ఐకేపీ సీసీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలో..
లింగంపేట : మండలంలోని నల్లమడుగు, బాణాపూర్ గ్రామాల్లో శుక్రవారం ఎంపీవో మలహరి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి నిర్మాణాలు వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇల్లు పూర్తయిన వెంటనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యదర్శులు, లబ్ధిదారులు, గ్రామ పెద్దలు ఉన్నారు.
సొంతింటి కల నెరవేరుతుంది
నిజాంసాగర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తుంకిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించాలని ఎంపీడీవో నరేశ్ సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శులు సమావేశంలో మాట్లాడారు. గృహాలు మంజూరైన వారు వంద శాతం కట్టుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో మలహరి, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.
ముత్యంపేట గ్రామంలో..
దోమకొండ: నిర్ణీత కాలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు పూర్తి చేయాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ కోరారు. శుక్రవారం మండలంలోని ముత్యంపేట గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన పనులు ప్రారంభించని నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్లు లేని వారు సద్వినియోగం చేసుకోవాలని, ఈవిషయంలో ఎవరు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి, శ్రీనివాస్, బాలరాజ్, తిరుపతిగౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, రాజు, విజయ, గంగమణి, రవి, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సమీక్ష


