బోధన్‌లో గంజాయి పట్టివేత
బోధన్‌టౌన్(బోధన్): మహారాష్ట్రలోని బిలోలి నుంచి బోధన్‌కు వస్తున్న ఆటోలో 1,270 గ్రా ముల గంజాయిని పట్టుకున్నట్లు ఏసీపీ శ్రీనివా స్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో శుక్రవా రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన వివరాలు వెల్లడించారు. బోధన్ శివారులోని మర్రి మైసమ్మ ఆలయ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బిలోలి నుంచి బోధన్‌కు వస్తున్న ఓ ఆటోను తనిఖీ చేశారు. ఆటోలో మహారాష్ట్రలోని బిలోలికి చెందిన గోనేకర్ గణేష్ కాశీనాథ్, బోధన్‌లోని బ్రాహ్మణగల్లీకి చెందిన గాడె శేఖర్, నిజామాబాద్‌కు చెందిన ఫేక్ అబ్దుల్ ఖైసర్ ఉన్నారు. ఆటోలో తనిఖీ చేయగా పోలీసులకు 1270 గ్రాముల గంజాయి లభ్యమైంది. పోలీసులు ఆటోలోని వ్యక్తులతోపాటు, గంజాయిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయిని పట్టుకున్న ఎస్సై మనోజ్, సిబ్బందిని సీపీ అభినందించారని తెలిపారు.


