అనర్హులకు ఉపాధి హామీలో హాజరు
● ఫీల్డ్ అసిస్టెంట్ల ఇష్టారాజ్యం
● పెద్దకొడప్‌గల్ ప్రజావేదికలో
విస్తుపోయే విషయాలు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): ఉపాధి హామీ పనులలో ఫీల్డ్ అసిస్టెంట్లు అనర్హులకు హాజరు వేసి డబ్బులు దండుకున్నట్లు తనిఖీలో తేలింది. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో అభినవ్ చందర్ అధ్యక్షతన శుక్రవారం మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 4వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 9 బృందాలతో 24 గ్రామాలకు సంబంధించిన ఉపాధి హామీ పనులపై తనిఖీలలో తేలిన విషయాలను ఏపీడీ వామన్ రావు దృష్టికి తీసుకోచ్చారు. వారం రోజుల పాటు గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీల్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. ప్రతి గ్రామంలోనూ లోపాలు ఉన్నట్లు, క్షేత్ర పరిశీలకుల వ్యవహార శైలి సక్రమంగా లేనట్లు సామాజిక తనిఖీ విభాగం సిబ్బంది గుర్తించారు. పోచారం, పోచారం తండాల్లో అనర్హులకు హాజరు వేసినట్లు గుర్తించారు. అలాగే గ్రామాల్లో మస్టర్లలో కూలీలకు బదులుగా సీనియర్ మేట్ సంతకాలు చేస్తున్నట్లు, దిద్దుబాట్లను గుర్తించారు. కాటేపల్లి గ్రామంలో సుమారు 66 మంది గ్రామస్తులు ఉపాధి హామీలో కూలి పనులు కల్పించాలని రెండేళ్లుగా రాసిస్తున్న మాస్టర్‌లలో పేర్లు రావడంలేదని తనిఖీ సమయంలో గుర్తించినట్లు బృందం సభ్యులు తెలిపారు. పనులు కొనసాగిన కొన్ని ప్రదేశాలలో అందుకు సంబంధించిన బో ర్డులను ఏర్పాటు చేయలేదు. వీటిపై ఏపీడీ వామన్ రావు స్పందిస్తూ చర్యలు తీసుకోవాలని మండలస్థాయి అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో ఎంపీవో లక్ష్మికాంత్ రెడ్డి, ఏపీవో సుదర్శన్, తనిఖీ బృందం తదితరులు పాల్గొన్నారు.
రెంజల్(బోధన్): మండల కేంద్రంలో ఊర కుక్కల దాడిలో ఓ లేగ దూడ మృతిచెందింది. శుక్రవారం గ్రామంలోని కుక్కలు దాడి చేయడంతో అమ్రాది వెంకట్‌కి చెందిన లేగ దూడ మృతిచెందింది. ఇటీవల రేబీస్ వ్యాధితో ఆలయానికి చెందిన లేగ దూడ మృతిచెందింది.
అనర్హులకు ఉపాధి హామీలో హాజరు


