
వైన్ షాపులకు 1400కు పైగా దరఖాస్తులు
● ముగిసిన దరఖాస్తుల
స్వీకరణ ప్రక్రియ
● గణనీయంగా తగ్గిన పోటీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణాలకు దరఖాస్తుల దాఖలు గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. జిల్లాలోని 49 వైన్ షాపులకు 1400కు పైగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం అర్ధరాత్రి వరకు సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీ లిస్తున్నారు. రెండేళ్ల కిందట 49 దుకాణాలకు 2,204 దరఖాస్తులు రాగా.. ఈ సారి తగ్గాయి. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా, ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. దీంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని భావిస్తున్నారు. సర్కిళ్ల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.
బాన్సువాడ రూరల్/కామారెడ్డి రూరల్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సందర్శన కోసం జిల్లాలో పదో తరగతి అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. బాన్సువాడ మండలం కోనాపూర్ జెడ్పీహైస్కూల్‌కు చెందిన విద్యార్థిని జి శైలజ, కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నిఖిల, రవిత్రేణి ఎంపికై నట్లు హెచ్‌ఎంలు శంకర్, సాయిరెడ్డి తెలిపా రు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైన్స్ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు త్వరలోనే ఇస్రో సందర్శనకు వెళ్తారన్నారు. శైలజను ఉపాధ్యాయులు, గ్రామస్తులు శనివారం అభినందించారు. ఉపాధ్యాయులు అంజయ్య, నబీ, రమేశ్, ప్రేమ్‌సింగ్, నర్సింగ్‌రావు, స్నేహలత, సుజాత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిన్నమల్లారెడ్డి పాఠశాల హెచ్‌ఎం సాయిరెడ్డి మాట్లాడుతూ.. భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు, గైడ్ టీచర్ ప్రవీణ్‌కుమార్ మార్గదర్శకత్వంలో తమ పాఠశాల విద్యార్థులు ఇస్రో సందర్శనకు ఎంపికయ్యారని అభినందించారు.
కామారెడ్డి అర్బన్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం రజినీకిరణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్స్‌లో ఉద్యోగాల భర్తీ కోసం బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్‌లోని 121 నంబర్ గదిలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొ న్నారు. ఎంపికై న వారు నిజామాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని, వివరాలకు 98854 53222, 76719 74009 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి క్రైం: రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుమోహన్ అన్నారు. మత్య్సశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదా నం ప్రాణదానంతో సమానమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్నవారికి రక్తం అందించడానికి జిల్లాలో విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రక్తదా నం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని అ భినందించారు. శిబిరంలో భాగంగా మత్య్స శాఖ అధికారులు, సిబ్బంది, మత్య్సపారిశ్రామిక సహకార సంఘాల ప్రతినిధులు మొత్తం 40 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. కా ర్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా అధికారి శ్రీప తి, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.