
బీసీ బంద్ సక్సెస్
కామారెడ్డి టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ శనివారం జిల్లాలో సక్సెస్ అయ్యింది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట శనివారం తెల్లవారుజామున జేఏసీ నాయకులు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా ధర్నా చేశారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ, నిజాంసాగర్ చౌరస్తాలో మానవహారం చేపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ బంద్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు పాల్గొన్నాయి. బంద్‌తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే సుభాష్, జేపీఎన్, మాయా, సిరిసిల్లా, స్టేషన్ రోడ్లు, నిజాంసాగర్ చౌరస్తా, కొత్తబస్టాండ్ ఏరియాలో బోసిపోయాయి. బస్సులు డిపో, బస్టాండ్‌లకు పరిమితమయ్యాయి. బంద్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ నాయకులు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులతోపాటు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కదలని ఆర్టీసీ బస్సు చక్రాలు
బంద్‌లో పాల్గొన్న వ్యాపార,
వాణిజ్య, విద్యా సంస్థలు
నిర్మానుష్యంగా మారిన రోడ్లు
42శాతం బీసీ రిజర్వేషన్
అమలు కోసం జేఏసీ డిమాండ్

బీసీ బంద్ సక్సెస్