
అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
● నివాళులు అర్పించిన ఐజీ, సీపీ
● నిందితుడి కోసం ఎనిమిది
పోలీసు బృందాల గాంలిపు
నిజామాబాద్‌అర్బన్: సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. శుక్రవారం బాబన్‌సాబ్ పహాడ్ వద్ద కెనల్ కట్ట ప్రాంతంలో రియాజ్‌ను పట్టుకునేందుకు కాని స్టేబుల్ ప్రయత్నం చేశాడు. కెనాల్ కాల్వ గుండా పారిపోతున్న రియాజ్‌ను వెంబడించి పట్టుకున్నాడు. అనంతరం తన బైక్‌పై సీసీఎస్ ఎస్సై విఠల్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి బైౖక్‌పై తీసుకువస్తున్నారు. ఈ సందర్భంలోనే రియాజ్ కానిస్టేబుల్‌ను పొడిచి హత్య చేశారు. నిందితుడు రియాజ్ సెల్‌ఫోన్ వదిలేసి మరో బైక్‌ను దొంగిలించి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అతడి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలు గాలిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు నగరంలోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం. కొన్ని బృందాలు పట్టణంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరికొన్ని బృందాలు రియాజ్ తరచుగా వెళ్లే ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీపీ సాయి చైతన్య అన్నారు.
అంత్యక్రియలో పాల్గొన్న ఐజీ, సీపీ
కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలు నగరంలో శనివారం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. స్థానిక రైల్వే కమాన్ ప్రాంతంలోని బ్యాంకు కాలనీలోని ఆయన నివాసం నుంచి శవ యాత్ర ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలకు మల్టీజోన్– 1 నార్త్ తెలంగాణ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ సాయి చైత న్య, పోలీస్ అధికారులు హాజరయ్యారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని సీపీ పేర్కొన్నారు. ప్రమోద్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. శవ యాత్రలో పాడె మోశారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడు రియాజున్ త్వరలోనే పట్టుకుంటామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించబోమన్నారు.