
అంబేడ్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
మాచారెడ్డి: పాల్వంచ మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జి.చంద్రం, అధ్యక్షునిగా ఎం.బాల్ నర్సు, ఉపాధ్యక్షుడిగా జి.నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా శంకర్ బాబు, కోశాధికారిగా సీహెచ్. మైసయ్య, కార్యదర్శిగా డి.రవి, సలహాదారులుగా సీహెచ్ లక్ష్మణ్, నడిపి నర్సింలు, శ్రీను, రమేష్, కార్యవర్గ సభ్యులుగా మల్లేష్, నర్సింలు, రాకేష్, చిన్న నర్సింలు, బాల ఎల్లయ్య, రాజులను ఎన్నుకున్నారు.
బాన్సువాడ రూరల్: బాన్సువాడ పట్టణానికి చెందిన అద్నాన్ నిర్మాతగా పలు భాషల్లో తెరకెక్కుతున్న వాంపర్స్ సాగా చిత్రంలోని పలు సన్నివేశాలను బాన్సువాడ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో చిత్రీకరిస్తున్నారు. మండలంలోని బోర్లంక్యాంపు, తాడ్కోల్ తదితర గ్రామాల్లో శనివారం రాత్రి చిత్ర సన్నివేశాలు తీశారు. హర్రర్ మూవీ కావడంతో రాత్రిపూట శ్మశానవాటిక, ఊడలమర్రి చెట్ల కింద షూటింగ్ తీస్తున్నారు. ఇటీవల చిత్రం టీజర్ విడుదల చేయగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టించిందని చిత్ర నటుడు, దర్శక, నిర్మాత అబ్దుల్ అద్నాన్ పేర్కొన్నారు. సినిమాలో యాక్షన్, కామెడీ, రొమాన్స్, హర్రర్ ఓ స్థాయిలో ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్ సందర్భంగా సినీతారలు జుబేర్‌ఖాన్, సనా సుల్తానా, బుష్రా షేక్, చేతన్, హన్స్‌రాజ్ సందడి చేశారు.
ప్రభుత్వాలు
జవాబుదారీగా ఉండాలి
నిజామాబాద్ నాగారం: రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ఉందని సీఎల్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో పౌరహక్కుల సంఘం(సీఎల్‌సీ) ఉమ్మడి జిల్లా 17వ మహాసభ జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పౌర హక్కుల సంఘం ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ ముందుకు సాగుతోందన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యమం, తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే ప్రజలతో కలిసి హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తోందన్నారు. కశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లోని హక్కులని, మారణ హోమానికి వ్యతిరేకంగా కార్యాచరణ కొనసాగిస్తోందన్నారు.

అంబేడ్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు