
కుక్కల స్వైర విహారం
● వాహనదారులను వెంటాడుతున్న కుక్కలు
● తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
దోమకొండ: గ్రామాల్లో ఎక్కడా చూసినా శునకా లు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపించి న వారిని వెంటాడుతున్నాయి. దొరికిన వారిపై దాడి చేస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా పదు ల సంఖ్యలో శునకాలు వీధుల్లో తిరుగుతుండడంతో జనాలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. నిత్యం కుక్కకాటు బాధితులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. వీటి సంఖ్య పెరగకుండా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రంలో కుక్కలు అడ్డు వచ్చి వాటిని తప్పించబోయి గ్రామానికి చెందిన పలువురు ఇటీవల గాయపడ్డారు. స్థానిక పాత పోలీస్‌స్టేషన్, బీబీపేట రోడ్డులో కుక్కలు ఎక్కువగా రోడ్డుపై అడ్డురాగా, వాటిని తప్పించే క్రమంలో బైక్‌లు అదుపు తప్పిపడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
రోడ్ల పక్కన కోళ్ల వ్యర్థాలు..
ముఖ్యంగా మండల కేంద్రంలో చికెన్ దుకాణా ల వద్ద కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. రోడ్ల పక్కనే కోళ్ల వ్యర్థాలు పడేయడటంతో కు క్కలు తిరుగుతున్నాయి. చికెన్ దుకాణదారులు కోళ్ల వ్యర్ధాలను దారుల వెంట వేయడంతో వాటిని తినేందుకు పోట్లాడుకుంటున్నాయి. కోళ్ల వ్యర్థాలను గ్రామానికి దూరంగా వేసేలా, పంచాయతీ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని మండల కేంద్రానికి చెందిన ప్రజలు కోరుతున్నారు.