
పత్తి రైతు చిత్తు..!
రెండో పంట సాగుపైనే ఆశ..
● భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి
● పెట్టుబడులు కూడా రాని వైనం
పెద్దకొడప్‌గల్(జుక్కల్): ఇటీవల నెల రోజుల పా టు నిరంతరాయంగా కురిసిన భారీ వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో మొ త్తం 5 వేల 310 ఎకరాలల్లో పత్తి పంటను రైతులు సాగుచేశారు. ఇది వరకు పత్తి పంటను మూడు,నా లుగు సార్లు తీసేవారు. 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి పండేది. ఇప్పడు కురిసిన భారీ వర్షాలకు తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గి ఒకేసారి పత్తిని తీయగానే పత్తి మొక్కలను తొలగించే పరిస్థితి వచ్చింది. దిగుబడి 4 క్వింటాళ్ల నుంచి 5 క్వింటాళ్లకు తగ్గిపోయింది. గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఎకరం భూమి కౌలు రూ.25 వేల వరకు ఉండగా ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.25 వేలు అవుతోంది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.10 వేల ధర ఉంటేనే రైతులకు గిట్టుబాటు ఉంటుంది. పంట చేనులో ఉన్నదన్నా ఏరుకోవాలంటే కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరింది అమ్ముకుందామంటే మార్కెట్లో మద్దతు ధరలేదు. ఓపెన్ మార్కెట్లో దళారీలదే రాజ్యం నాణ్యత పేరుతో వారు నిర్ణయించిందే ధర. రూ.4,800 నుంచి రూ.5, 200 వరకు ధరకే కొనుగోలు చేస్తున్నారు. తక్షణమే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన పత్తి నాణ్యతా ప్రమాణాల ఆంక్షలు లేకుండా రూ.10 వేల కనీస ధర తగ్గకుండా కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
నాకున్న మూడు ఎకరాలల్లో పత్తి పంట వేసుకున్నాను. భారీ వర్షాలకు పత్తి నల్లబారడమే కాకుండా నాణ్యత కూడా తగ్గిపోయింది. 8 నుండి 10 క్వింటాళ్ల పత్తి పండేది. ఇప్పడు కురిసిన భారీ వర్షాలతో తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గింది. తక్షణమే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.కనీసం రూ.10 వేలు ధర తగ్గకుండా కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగాన్నిఆదుకోవాలి. – తోట కిష్టయ్య, రైతు, పెద్దకొడప్‌గల్
నేను 8 ఎకరాలు కౌలు తీసుకున్నాను. గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.10 వేలు ధర ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. కూలీలు దొరక్క కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
– గోతి సుప్చంద్, రైతు, టికారం తండా
పత్తి పంట దెబ్బతినడంతో రెండో పంటగా రైతులు మొక్కజొన్నపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. తీయటానికి వచ్చిన పత్తిని తీసుకుని వెంటనే పత్తిని తొలగించి దాని స్థానంలో మొక్కజొన్న పంట వేసేందుకు రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది కూడా పత్తి పంట నష్టం రావడంతో రెండో పంటగా మొక్కజొన్న సాగుచేశారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి క్వింటా రూ.2 వేలపైనే పలకడంతో రైతులకు కొంత ఊరట లభించింది.

పత్తి రైతు చిత్తు..!

పత్తి రైతు చిత్తు..!