
‘సాక్షి’పై కూటమి కుట్రలు
కామారెడ్డి టౌన్: ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షర యజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభు త్వం చేస్తున్న కుట్రలు చేస్తోందని ప్రజా, ఉ పాధ్యాయ, జర్నలిస్టు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లోని సా క్షి దినపత్రిక ప్రధాన కార్యాలయంపై దాడు లు అలాగే ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు వంటిచర్యలను మానుకోవాలని అ న్ని వర్గాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం దారుణం. ఏపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. సాక్షిపై కక్ష సాధింపులను మానుకోవాలి.
– ఎల్ దశరథ్, సీపీఐ జిల్లా
కార్యదర్శి
మీడియా జోలికి వస్తే ఊరుకునేది లేదు. ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. రాజకీయంగా ఏదైనా ఉంటే కోర్టులు, చట్టాలు ఉ న్నాయి. న్యాయపరంగా పోరాడాలి. సాక్షిపై దాడులు చేయడం, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. – ముదాం శంకర్,
టీయూడబ్ల్యూజే, జిల్లా ఉపాధ్యక్షుడు
పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షిపై కక్ష సాధింపులు మానుకుని చట్టప్రకారం ముందుకెళ్లాలి. ప్రజా సమస్యలను కథనాల రూపంలో రాస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు.
– కొంగల వెంకటి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
సాక్షి మీడియాపై రాజకీయ కక్షతోనే దాడులు చేయడం సరికాదు. వాస్తవాలను రాస్తున్న మీడియాపై అక్రమ కేసులు బకాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నాం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కుట్రలు మానుకోవాలి. – సీహెచ్ అనిల్‌కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
దాడులు, అక్రమ కేసులు
బనాయించడం దారుణం
కక్ష సాధింపు చర్యలను
మానుకోవాలి
పత్రికాస్వేచ్ఛను కాపాడాలి

‘సాక్షి’పై కూటమి కుట్రలు

‘సాక్షి’పై కూటమి కుట్రలు

‘సాక్షి’పై కూటమి కుట్రలు

‘సాక్షి’పై కూటమి కుట్రలు