కామారెడ్డి టౌన్: సీనియర్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సబబు కాదని, దీనినుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్ ప్రతినిధులు కోరారు. సోమవారం తపస్ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ చందర్‌నాయక్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 15 ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, రాజశేఖర్, సత్యనారాయణ, దత్తాచారి, సంతోష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్ సొసైటీ
చైర్మన్‌గా ఇంగు రాములు
బాన్సువాడ : బీ ర్కూర్ సహకార సంఘం అధ్యక్షు డు ఎవరవుతార న్న ఉత్కంఠకు తెర పడింది. సొసైటీ చైర్మన్‌గా ఇంగు రాములును నియమిస్తూ సోమవారం డీసీవో రామ్మోహన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చైర్మన్‌గా పనిచేసిన గాంధీ అనారోగ్యం కారణంగా పదవి కి రాజీనామా చేశారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాధాకృష్ణను ఇన్‌చార్జి అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఆయన సహకార సంఘంలో రూ.1.20 లక్షల విలువ గల ఎరువులను తీసుకుని డబ్బులు చెల్లించకపోవడంతో పదవినుంచి తొలగించారు. దీంతో చైర్మన్ పదవి మళ్లీ ఖాళీ అయ్యింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్గీయుడైన డైరెక్టర్ ఇంగు రాములుతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏ నుగు రవీందర్‌రెడ్డి వర్గీయుడైన డైరెక్టర్ పో గు పాండు ఇద్దరు చైర్మన్ స్థానం కోసం పో టీపడ్డారు. చివరికి పోచారం వర్గానికి చెంది న రాములునే అధ్యక్ష పదవి వరించింది.
19న విత్తన క్షేత్రంలో పంట ఉత్పత్తుల వేలం
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ఈనెల 19న మధ్యాహ్నం పంట ఉత్పత్తులను వేలం వేయనున్నట్లు క్షేత్రం ఏడీఏ ఇంద్రసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన క్షేత్రంలో విత్తనం కోసం ఉపయోగపడని కేఎన్‌ఎం–1638 సన్నరకానికి చెందిన 492 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విత్తన క్షేత్ర కార్యాలయంలో వీటిని వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. వేలం తర్వాత నిర్ధారించిన సొమ్ములో సగం డబ్బులను రెండురోజులో చెల్లించాలని, మిగతా మొత్తాన్ని వారంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.
నిజాంసాగర్‌లోకి
భారీ ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 4 వరద గేట్ల ద్వారా 27,128 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా 1,404.72 అడుగుల (17.397టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు.
రేపు జాబ్‌మేళా
కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. హెటెరో ఔషధ కంపెనీలో 40 జూనియర్ ఆఫీసర్ పోస్టులు, 100 జూనియర్ కెమిస్ట్ ట్రైనీ (పురుషులు మాత్రమే) పోస్టులు, 60 జూనియర్ ఇంజినీర్ పోస్టులు భర్తీ చేసేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 90598 88389, 76719 74009 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి