
పోషణ మాసాన్ని నిర్వహించాలి
కామారెడ్డి క్రైం: పోషణమాసం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పోషణమాసం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి వచ్చేనెల 16 వరకు పోషణమాసం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. పోషణ లోపంతో ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీఆర్డీవో సురేందర్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీఈవో రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.