
‘విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి’
కామారెడ్డి టౌన్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజు లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విమోచన దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించిందని, ప్రస్తుత సర్కార్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని, ఇది సరి కాదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న తెలంగా ణ విమోచన దినోత్సవంగానే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు విపుల్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు సురేష్, వేణు, సంతోష్‌రెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.