
చిరుతపులి సంచారమంటూ వైరల్
● భయాందోళనకు గురైన
మద్నూర్‌వాసులు
● అది చిరుత కాదు.. అడవి పిల్లి అని నిర్ధారించిన అటవీ శాఖాధికారులు
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో చిరుత పులి తిరుగుతుందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు మద్నూర్‌లో చిరుత పులి తిరిగిందని వాటి పాదముద్రలు ఉన్నాయని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అధికారులు రంగంలోకి దిగా రు. మద్నూర్ ఎస్సై విజయ్‌కొండ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాంచందర్‌లు తన సి బ్బందితో మ ద్నూర్ శివారు లో చిరుత అడు గులను పరిశీలించారు. పూర్తి వి చారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారు లు అది చిరుత పులి పాదంకాదని అడవి పిల్లి పాదం అని తెల్చడంతో ప్రజలు ఊపిరిపిల్చుకున్నారు. చిరుత పులి అడుగులు పెద్దగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందవద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు.