
ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు ఇవ్వొద్దు
బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయపాల్‌రెడ్డి సూచించారు. మండలంలోని కోనాపూర్, సంగోజీపేట్ తదితర గ్రామాల్లో గురువారం పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు తమకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా తెలుసుకోవచ్చన్నారు. సందేహాల నివృత్తికి ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18005995991ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు బిల్లుల చెల్లింపు, పనులకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేసే విధానాన్ని తెలిపారు. అవసరమైన ఇసుకను రెవెన్యూ అధికారి అనుమతితో ఉచితంగా తెచ్చుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఈఈ గోపాల్, ఏఈ వినీత్, పంచాయతీ కార్యదర్శి భరత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు.