
సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కోరుతూ శుక్రవారం బీఆర్‌ఎస్ నాయకులు సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్ నాయకులు అంజిరెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలోని పాత అంగడి బజార్, కుమ్మరి గల్లీ, పాత బాన్సువాడ, గౌలీగూడ, ఇస్లాంపూర తదితర కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైయినేజీలు నిర్మించాలని అన్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పాడుతుందని అన్నారు. ఇంటి, కుళాయి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు వినతి పత్రం అందజేశారు. నాయకులు సాయిబాబా, చందర్, రమేష్‌యాదవ్, ఇషాక్, సాయిలు, నాగనాథ్, ఉబేద్, అప్జల్, లతీఫ్ తదితరులు ఉన్నారు.