
నిజాంసాగర్ 4 గేట్ల ఎత్తివేత
నిజాంసాగర్ : సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 15,296 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నాలుగు వరద గేట్లను ఎత్తి 21,988 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1,404.82 అడుగుల(17.542 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
‘ఇళ్లను త్వరగా నిర్మించుకునేలా
ప్రోత్సహించాలి’
కామారెడ్డి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లు త్వరగా పూర్తి చేసేలా లబ్ధిదారులను ప్రో త్సహించాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయపాల్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారితో మాట్లాడి ఏదైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ (1800 599 5991)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇందిరమ్మ పథకానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తోందని, ఇందుకోసం రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ సుభాష్, ఏఈ రాము తదితరులు పాల్గొన్నారు.
మరమ్మతుల పరిశీలన
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట శివారులోని పోచారం ప్రధాన కాలువకు చేపట్టిన మరమ్మతు పనులను శుక్రవారం ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనులను జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ ఏఈ అక్షయ్‌కుమార్ ఉన్నారు.
సీ్త్రనిధి బోర్డు రాష్ట్ర
కోశాధికారిగా స్రవంతి
బీబీపేట : సీ్త్రనిధి రాష్ట్ర బోర్డు కోశాధికారిగా మండల సమాఖ్య అధ్యక్షురాలు సదాల స్రవంతి ఎన్నికయ్యారు. రాష్ట్ర సీ్త్రనిధి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కోశాధికారిగా తనను ఎన్నుకున్నట్లు స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమెను జిల్లా సమాఖ్య సభ్యులు సన్మానించారు.

నిజాంసాగర్ 4 గేట్ల ఎత్తివేత

నిజాంసాగర్ 4 గేట్ల ఎత్తివేత

నిజాంసాగర్ 4 గేట్ల ఎత్తివేత