
‘పీజీ కోర్సులకు ప్రతిపాదనలు పంపండి’
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధి, పీజీ కోర్సులకోసం ప్రతిపాదనలు పంపించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. శుక్రవారం ఆయన రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరే షన్ చైర్మన్ జి.అమిత్‌రెడ్డితో కలిసి కళాశాలను సందర్శించారు. డెయిరీ వివిధ వి భాగాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కళాశాలకు ప్రహారీ నిర్మించ డానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పీజీ కోర్సు ప్రారంభిస్తే ఇక్కడి బీటెక్ వి ద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని కళాశాల అసోసియేట్ డీన్ సురేశ్ రాథోడ్ వి వరించారు. కళాశాల అధ్యాపకులు ఉమాపతి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
పాతరాజంపేట డెయిరీ సందర్శన
పాతరాజంపేటలోని విజయ డెయిరీని వాకిటి శ్రీహరి, గుత్తా అమిత్‌రెడ్డి సందర్శించారు. 45 ఏళ్లుగా సేవలందిస్తున్న డెయిరీని ఆధునికీకరించాల్సి ఉందన్నారు. పాతరాజంపేట డెయిరీ అభివృద్ధి విషయమై మంత్రి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వరరావు, జీఎం మధుసూదన్, అధికారులు కవిత, ధనరాజ్, లావణ్య, వైష్ణవి, పాల ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, కిష్టారెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన ఉపాధ్యాయ నేత పుల్గం దామోదర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఉద్యోగ విరమణ చేయడంతో శుక్రవారం ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.